హీరో రమ్మంటే వెళ్లాల్సిందే: మల్లిక

హీరో రమ్మంటే వెళ్ళాలి…
తెల్లవారుఝామున 3 గంటలకు పిలిచినా హీరోయిన్ పరిగెత్తుకుని హీరో ఇంటికి చేరుకోవాలి…
పిలవగానే వెళ్లే హీరోయిన్లకే అవకాశాలు ఇస్తారు.
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉంది…

ఇలాంటి భారీ స్టేట్మెంట్లు ఇచ్చింది ఒకప్పుడు అనేక సినిమాల్లో నటించిన శృంగార తార మల్లిక శెరావత్.

ఈ తరం కుర్రాళ్లకు, ప్రేక్షకులకు మల్లిక గురించి తెలియక పోవచ్చు. ఒక 15 ఏళ్ల క్రితం ఆమె సంచలనం. ‘మర్డర్’ అనే సినిమాలో అందాలను ఆరబోసి, ముద్దు సీన్లతో మురిపించి కుర్రకారును ఆకట్టుకొంది. ‘సెక్సీ’ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో ఆమెకున్న క్రేజ్ ని చూసి జాకీచాన్ కూడా తన హాలీవుడ్/చైనీస్ మూవీ ‘మిత్’లో అవకాశం ఇచ్చాడు.

మణిరత్నం ఆమెని ‘గురు’ సినిమాలో ఐటెం సాంగ్లో, అలాగే కమల్ హాసన్ ‘దశావతారం’లో నటింపచేశారు. దాదాపు 30 చిత్రాల్లో నటించింది మల్లిక. ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తుండడం విశేషం.

తాను ఆ పని చెయ్యలేదు కాబట్టే తనకు అవకాశాలు తక్కువ వచ్చాయి అని చెప్పుకుంటోంది ఈ 46 ఏళ్ల భామ.

తాను నటించిన కొన్ని సినిమాలు విజయం సాధించకపోవడం, కొన్నాళ్ళూ ఇండియా వదిలి విదేశాల్లో ఉండడం వల్లే ఆమె కెరీర్ ముగిసింది అనేది బాలీవుడ్ విశ్లేషకుల మాట. కానీ ఆమె మాత్రం తాను మిగతా హీరోయిన్లలా హీరోల దగ్గరికి వెళ్ళకపోవడం వల్లే తొందర్లోనే హీరోయిన్ గా తన కెరీర్ కి ఎండ్ కార్డు పడింది అన్నట్లుగా చెప్తోంది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన పలువురు హీరోయిన్లు చెప్పిన మాటే ఆమె చెప్తోంది.

 

More

Related Stories