మాళవిక ఈ సమ్మర్ సుందరి!


మాళవిక నాయర్ టీనేజ్ ప్రాయంలోనే తెలుగుసినిమాల్లోకి అడుగుపెట్టింది. కాలేజ్ లో చదువుకుంటూనే సినిమాల్లో నటించింది. ఇప్పుడు చదువు పూర్తి అయింది. పూర్తిగా కెరీర్ పై ఫోకస్ నిలిపింది.

మాళవిక నటిస్తున్న రెండు రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ వేసవిలో బరిలోకి దిగడం విశేషం. ఒకటి ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’. రెండోది ‘అన్నీ మంచి శకునములే’.

ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి

ఈ సినిమాలో నాగశౌర్య హీరో. అవసరాల శ్రీనివాస రావు డైరెక్ట్ చేశారు. ఇందులో ఒక పాట ఇప్పటికే బాగా పాపులర్ అయింది. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 17న విడుదల కానుంది. ఈ వేసవిలో ఆమెకి మొదటి మూవీ ఇది.

అన్నీ మంచి శకునములే

నందిని రెడ్డి తీస్తున్న సినిమా ఇది. నందిని రెడ్డి గత చిత్రం “ఓ బేబీ” పెద్ద హిట్. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం, మహానట, సీతా రామం వంటి హిట్స్ తీసిన నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ నటించాడు. హీరోగా అతనికి పెద్ద హిట్స్ లేవు కానీ తాజాగా విడుదలైన టీజర్ మాత్రం ప్లెజెంట్ గా ఉంది. ఇది మే 18న రానుంది.

మొత్తానికి ఈ వేసవిలో ఈ భామకి స్పెషల్. రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి.

Advertisement
 

More

Related Stories