- Advertisement -

హీరోయిన్ మాళవిక శర్మ… చాలా డిఫరెంట్. ఆమె విద్యావంతురాలు. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే కష్టపడి లా పూర్తి చేసింది. అలాగే మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ తీసుకొని ఇప్పుడు లా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. కేసులు వాదిస్తోంది. అటు తన లా ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ… ఇటు సినిమా ఆఫర్లకి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
మాళవిక శర్మ … ఇప్పటికే తెలుగులో రవితేజ సరసన ‘నేల టికెట్’, రామ్ సరసన ‘రెడ్’ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆఫర్ల కోసం హైదరాబాద్ కి మకాం మార్చింది. అలాగే మొన్న తెలంగాణ హైకోర్టులో ఒక కేసు వాదించింది.
ఇక…. ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికపై హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తుంటుంది. లాయర్ గా మారినా కూడా ఇలాంటి ఫోటోషూట్ ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అందుకే మాళవిక శర్మ డిఫరెంట్ హీరోయిన్.