- Advertisement -

‘నేల టికెట్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మాళవిక శర్మ తన రెండో తెలుగు సినిమాగా “రెడ్”లో నటించింది. ముగ్గురు హీరోయిన్లున్న ఈ సినిమాలో రామ్ సరసన ఒక హీరోయిన్ ఈ భామ.
ఈ సినిమా ప్రొమోషన్ లలో భాగంగా ఇస్తున్న మీడియా ఇంటర్వ్యూలలో తన ఫిజిక్ గురించి మాట్లాడింది.
“నేను చాలా బక్క పలుచగా ఉన్నాను అంటున్నారు. అందుకే కొంత బరువు పెరిగే పనిలో ఉన్నాను. జనరల్ గా హీరోయిన్లు అందరూ డైట్ లో ఉంటారు. కానీ నేను బరువు పెరగాలని బాగా తింటున్నా. అయినా, పెద్దగా పెరగలేదు. బరువు పెరగడమే 2021లో మెయిన్ టార్గెట్,” అని చెప్పింది.
ALSO CHECK: Malvika Sharma – Photos
మాళవిక శర్మ అనేక యాడ్స్ లో నటించింది. ఇక సోషల్ మీడియాలో తన అందచందాల ఫొటోస్ ని తెగ షేర్ చేస్తుంటుంది.