ఆ వందమందికి అక్కడే గిఫ్ట్!

ప్రతి ఏడాది 100 మంది అభిమానులకు కొన్ని ఖరీదైన బహుమతులు అందచేస్తుంటాడు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఇంకో అడుగు ముందుకేశాడు. ఏకంగా 5 రోజుల పాటు వెకేషన్ కి పంపిస్తున్నాడు. మనాలిలోని ఒక రిసార్ట్ లో వారికి విడిది ఉంటుంది. మొత్తం ట్రిప్ ఖర్చు అంతా విజయ్ దేవరకొండ భరిస్తాడు.

సోషల్ మీడియాలో అప్లై చేసుకున్న తన అభిమానుల నుంచి ఒక వంద మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ వెకేషన్ బంపర్ ఆఫర్ అందిస్తారు.

ఐదేళ్ల క్రితం అభిమానులకు ఐస్ క్రీంలు ఇవ్వడంతో ఈ ‘దేవర శాంటా’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఏకంగా వెకేషన్ ట్రిప్పులు స్పాన్సర్ చేసే వరకు ఎదిగాడు. ‘లైగర్’ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. కానీ, విజయ్ పాపులారిటీ తగ్గలేదు. అలాగే, అతనికి సినిమాల్లో కన్నా బ్రాండ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది.

ఛారిటీలకు, అభిమానులకు సహాయం చెయ్యడం వంటి వాటిలో విజయ్ ముందుంటాడు. ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువ అయ్యేందుకు కొత్త కొత్త పద్ధతులు కూడా పాటిస్తుంటాడు.

 

More

Related Stories