
ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తో వందల కొద్ది అవార్డులు దక్కించుకున్నారు దీపక్ రెడ్డి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కూడా లభించింది. ఇంతకీ ఆయన తీసిన మూవీ పేరు ‘మనసానమః’. షార్ట్ ఫిలిం కేటగిరిలో ఇప్పుడు ఆస్కార్ బరిలో అదృష్టం పరీక్షించుకోవాలని అనేది అతని తపన. అక్కడికి వెళ్లి ప్రొమోషన్ హడావిడి చేద్దామంటే వీసా ఇబ్బందులు ఉన్నాయట.
స్క్రీనింగ్ కోసం అమెరికా కి దర్శకుడు వెళ్లలేకపోతున్నాడు.ఎందుకంటే ఇప్పుడు అమెరికా వీసాలకు స్పాట్ లు దొరకడం లేదు.
కోవిడ్ కారణంగా ఏర్పడ్డ వీసా నిబంధనల వల్ల ఫిలిం ఫెస్టివల్స్ కి అటెండ్ అవ్వలేకపోయాడు. ఈ సెప్టెంబర్ నెలలో న్యూ జెర్సీ, హాలీవుడ్ లో ఉన్న రెండు ఈవెంట్స్ కి అయినా అటెండ్ అయి దేశాన్ని రెప్రెసెంట్ చేయాలన్నది అతని కోరిక. దానికి కోసం దీపక్ రెడ్డి తిప్పలు పడుతున్నారు.
ఈ దర్శకుడికి సాధ్యమైనంత త్వరగా వీసా సమస్యలు తీరేలా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుకుందాం.