
జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రంలోని మూడో పాట “మనసు కథ”ను అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు రిలీజ్ చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువజంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో బేబి సహశ్రిత మరో కీలక పాత్రధారి.
“కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న కాలంలో పోలీసులు అందించిన అవిశ్రాంత సేవలు చూశాక వారిపై గౌరవభావం రెట్టింపయ్యిందని,” అన్నారు జగపతి బాబు.
బిజీ షెడ్యూల్‌లోనూ సమయాన్ని కేటాయించి, విడుదల చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులకు హీరో రామ్ కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత హీరోలకు తమ వంతు కృతజ్ఞతలు తెలియజేయడానికి శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.