మంచు లక్ష్మికి మల్లిక చీవాట్లు

సుశాంత్ మరణం, దానికి సంబంధించి రియా ఎదుర్కొంటున్న విచారణలను దృష్టిలో పెట్టుకొని మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ తిరిగి ఆమెకే రివర్స్ అయింది. రియా చక్రబొర్తిపై మీడియా ట్రయల్స్ ఎక్కువయ్యాని, ఆమెకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టుపై.. సుశాంత్ మేనకోడలు మల్లికా సింగ్ విరుచుకుపడింది.

ఈ మేరకు మంచు లక్ష్మి మాటల్ని ఖండిస్తూ.. ఇనస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది మల్లిక. “నాకు ఆశ్చర్యంగా ఉంది. ‘పెయిన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ’, ‘కొలీగ్ కు అండగా నిలబడ్డం’ లాంటి పదాలకు అర్థాలు ఇప్పుడే కొందరికి గుర్తుకురావడం నాకు ఆశ్చర్యంగా ఉంది.” ఇలా మంచు లక్ష్మి పోస్ట్ పై సెటైర్లు వేసింది మల్లిక.

మంచు లక్ష్మి తన ట్వీట్ లో సుశాంత్, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుతం కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్న రియాకు కొలీగ్స్ అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చింది. ఈ మాటలు మల్లికకు ఆగ్రహం తెప్పించాయి.

Related Stories