టీడీపీ బాట పట్టనున్న మనోజ్?

మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం గుళ్ళు తిరుగుతున్నాడు. తన భార్య మౌనిక తరఫు చుట్టాలను కలుస్తున్నాడు. మౌనిక సొంత ప్రాంతమైన ఆళ్లగడ్డ వెళ్ళినప్పుడు జరిగిన హంగామాని బట్టి మంచు మనోజ్ తెలుగుదేశంలో చేరుతారా అన్న అనుమానం వస్తోంది.

మౌనిక సోదరి మాజీ మంత్రి. గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖని చూశారు. మౌనిక కూడా సోదరి బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది అని అంటున్నారు. వారి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి మనోజ్, మౌనిక కూడా తెదేపాలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది.

ఐతే, మనోజ్ సోదరుడు మంచు విష్ణు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బంధువు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కజిన్ వెరోనికాని విష్ణు పెళ్లాడాడు. విష్ణు వైసీపీ వైపు ఉన్నారు. వీళ్ళ తండ్రి మొదట తెదేపాలో ఆ తర్వాత రకరకాలుగా మాట్లాడి వైకాపాలో చేరారు. ఇప్పుడు వైకాపాలో ఉన్నారో లేదో తెలియదు.

మొత్తానికి మనోజ్ రెండో పెళ్లితో రాజకీయ ముచ్చట్లు మొదలయ్యాయి.

మంచు మనోజ్, మౌనిక రెడ్డి, మంచు మనోజ్ టీడీపీ,

Advertisement
 

More

Related Stories