
అన్నదమ్ముల సవాల్!!
వీధికెక్కిన కుటుంబ విభేదాలు!!!
ఇలా ఎన్నయినా హెడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. తన అన్న గురించి హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోతో రచ్చ రచ్చ అయింది. మొన్నటివరకు గుట్టుచాటుగా సాగిన ఉన్న గొడవలు ఇప్పుడు పబ్లిక్ అయిపోయాయి.
“ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుం టారండి. ఇది ఇక్క డి పరిస్థితి,” అంటూ మనోజ్ చెబుతున్న వీడియో బాగా వైరల్ అయింది.
విష్ణు ఒక ఇంట్లో వీరంగం వేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. మంచు వారి బంధువు సారథి. గతంలో అతను విష్ణుకి సంబంధించిన పనులు చూసుకునేవారు. ఇప్పుడు మనోజ్ వ్యవహారాలు చూసుకుంటున్నారట. సారథి తన తమ్ముడు మనోజ్ ని తనపైకి ఎగదోస్తున్నాడు అనేది విష్ణు ఆరోపణ. ఆ క్రమంలోనే ఈ గొడవ జరిగినట్లు టాక్.
ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి టైంలోనే ఈ కుటుంబంలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ సోషల్ మీడియా వేదిక ద్వారా మొత్తంగా పబ్లిక్ అయిపొయింది.
ALSO READ: Manchu Vishnu and Manoj take their fight to the streets
అంతే కాదు తన అన్న దౌర్జన్యం చేస్తున్నాడు అని మంచు మనోజ్ పోలీసులకు చెప్పేందుకు డయల్ 100కి కాల్ చేశాడని టాక్.