తప్పుకున్నమంచు విష్ణు

- Advertisement -
Ginna


దసరా బరిలో ఉండాలని ఉవ్విళ్లూరిన మంచు విష్ణు ఇప్పుడు తప్పుకున్నారు. అక్టోబర్ 5న విష్ణు మూవీ విడుదల కావడం లేదు.

విష్ణు నటించిన ‘జిన్నా’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. కొన్ని పాటలు కూడా విడుదలయ్యాయి. టీజర్ వచ్చింది. అక్టోబర్ 5న విడుదల అని చాలా కాలమే ప్రకటించాడు విష్ణు. ఐతే, ఇప్పుడు బరి నుంచి వెనక్కి వెళ్ళాడు.

అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’, సితార సంస్థ నిర్మించిన ‘స్వాతిముత్యం’ విడుదల అవుతున్నాయి. రెండు పెద్ద చిత్రాలు, ఒకటి మీడియం రేంజ్ మూవీ. వీటితో పోటీపడాలా వద్దా అని మొన్నటివరకు ఆలోచించిన విష్ణు ఇప్పుడు తప్పుకున్నాడు. వాటితో పోటీ పడకూడదని వెనకడుగు వేశాడు.

‘జిన్నా’ సినిమాలో పాయల్ రాజపుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. గ్లామర్ ఉంది. కామెడీ ఉంది. సోలోగా రావాలని భావిస్తున్నారట. మరి కొత్త డేట్ ఎప్పుడో అనేది చూడాలి.

 

More

Related Stories