ఎవరూ చూడని కథ ఇది: పాయల్

- Advertisement -
Payal



‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్ మళ్లీ అదే దర్శకుడు అజయ్ భూపతి తీసిన మూడో చిత్రంలో నటించింది. అదే ‘మంగళవారం’… ఈ సినిమాలో ఆమె ఇండియాలో ఎవరూ చెయ్యని పాత్ర చేసిందట. మీడియాతో పాయల్ ముచ్చట్లు.

నేనే ఆయన వెంట పడ్డా

‘సార్… నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి’ అని అజయ్ భూపతి వెంట పడ్డాను. ‘మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా’ అని చెప్పారు. చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని అన్నారు. నా నిరీక్షణ “మంగళవారం”తో ముగిసింది. ఇందులో సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం.

ఈ సినిమాలో నా పాత్ర పేరు శైలు. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం లేదు. ఇటువంటి సినిమా, క్యారెక్టర్ నేను చేయలేదు. శైలు క్యారెక్టర్ హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజు రెండు గంటలు పట్టింది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది.

ఎవరూ చూడని కథ

ఇలాంటి కథ ఇండియన్ మూవీస్ లో రాలేదు. ఇలాంటి పాత్ర ఎవరూ ఇక్కడ చెయ్యలేదు. అజయ్ భూపతి గారి మీద నమ్మకంతో నేను ఈ పాత్ర చేశాను.

Payal Rajput

మరిచిపోలేని బన్నీ కాంప్లిమెంట్

‘పాయల్… నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు” అని అల్లు అర్జున్ చెప్పారు.చాలా ఆనందం వేసింది. ఆయన్ని కలిసినప్పుడు బ్లష్ అయ్యాను. ఆయన కాంప్లిమెంట్ మరింత ఆనందాన్ని ఇచ్చింది.

More

Related Stories