అందం… అటెన్షన్

మన్నారా చోప్రా… బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాకు కజిన్ అవుతుంది. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తోంది. అడిగిన ప్రతి ఒక్క ఈవెంట్ కు వెళ్తోంది. ఎన్నో వేదికలపై ఆడిపాడుతోంది. అలా తనకంటూ కొన్ని సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ… స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో… మన్నారా చోప్రా ఏం చేయాలో పాలుపోవడం లేదు.

సునీల్ నటించిన ‘జక్కన్న’ సినిమాతో మన్నారా చోప్రా మెయిన్ లీగ్ లోకి ఎంటరైంది. ఆ సినిమా కోసం బాగానే అందాలు చూపించింది. కానీ సునీల్ ఫేట్ ముందు మన్నారా అందాలు తేలిపోయాయి. ఎప్పట్లానే ‘జక్కన్న’ మూవీ ఫ్లాప్ అయింది. మన్నారా క్రేజ్ డౌన్ అయింది. ఇక అప్పట్నుంచి ఆమెను ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. ‘తిక్క’, ‘రోగ్’, ”సీత”.. ఇలా చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటే బాల్చీ తన్నేశాయి.

ప్రస్తుతం మన్నారాకు ఛాన్సులు ఇచ్చే వాళ్లే కరువయ్యారు. దీనికి తోడు లాక్ డౌన్ ఆమె కెరీర్ ను మరింత దెబ్బకొట్టింది. దీంతో చేసేదేం లేక మినిమం గ్యాప్స్ లో ఫొటో షూట్స్ చేస్తోంది. వెండితెరపై ఆరబోయాల్సిన అందాల్ని, ఫొటోషూట్స్ లో పరిచేస్తోంది. ఈ ఫొటోషూట్స్ ఆమెకు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.

Related Stories