
మంచు మనోజ్, భూమా మౌనిక మంచు “నమస్తే వరల్డ్” బ్రాండ్ తో చిన్నారుల బొమ్మలు కార్టూన్, యానిమేషన్ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్ pop up store ను ప్రారంభించారు.
నమస్తే వరల్డ్ సీఈవో భూమా మౌనిక మంచు: “పిల్లల కోసం నమస్తే వరల్డ్ ముందుకు వచ్చింది. నా భర్త మంచు మనోజ్ పూర్తి సహకారం అందించారు. మన ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి అనేది ఆలోచన. మన దేశంలో గొప్పే సంస్కృతి ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు, కళలను వెలికి తీసేందుకు ఇది చక్కటి ఫ్లాట్ ఫాంగా నిలుస్తుంది.
“నమస్తే బ్రాండ్ టాయ్స్ దేశంలోని అన్ని జియో ఔట్ లెట్స్ లో లభిస్తున్నాయని.. రిలయన్స్ తో పాటు అన్ని షోరూంలలో అందుబాటులో ఉంచామ”న్నారు మౌనిక .
క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు అద్బతమైన అవకాశం ఇచ్చారు హీరో మనోజ్. చిన్నారులు బొమ్మలు గీసి తమకు పంపిస్తే.. బొమ్మలుగా మార్చి మార్కెట్ లో ఉంచుతాం.. మంచు మనోజ్ తెలిపారు.