తొలి సినిమాకే రూ.కోటి పారితోషికం

కొత్తగా ఓ హీరోయిన్ మార్కెట్లోకి అడుగుపెడితే ఎంతిస్తారు? మన లెక్కల్లో చూసుకుంటే మహా అయితే 30-40 లక్షలు. అదే బాలీవుడ్ లో అయితే ఇంకాస్త ఎక్కువ. కానీ మొదటి సినిమాకే కోటి రూపాయలు తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు.. ఆమె పేరు మానుషి చిల్లర్.

పృధ్వీరాజ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది మానుషి చిల్లర్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసింది. వెంటనే నిర్మాతలు అంగీకరించారు. ఆమె అడిగింత ఇచ్చేశారు. ఇలా మొదటి సినిమాకే ఈమె కోటి రూపాయలు అందుకోవడం వెనక ఓ రీజన్ ఉంది.

ఈమె 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. అందుకే ఆమెకు అంత క్రేజ్. ఇండియా నుంచి మిస్ వరల్డ్ గా ఎంపికైన ఆరో మహిళ ఈమె. అందుకే ఆమెను తమ సినిమాల్లో తీసుకొచ్చేందుకు చాలామంది ప్రయత్నించారు.

అయితే మానుషి మాత్రం క్రేజ్ ఉన్న ప్రాజెక్టులోకే ఎంటర్ అవ్వాలనుకుంది. అందుకే అక్షయ్ కుమార్ నటించిన పృధ్విరాజ్ ను సెలక్ట్ చేసుకుంది. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిజల్డ్ పై మానుషి కెరీర్ ఆధారపడి ఉంది. ఒకరిద్దరు తప్ప హీరోయిన్లంతా, అక్షయ్ కుమార్ సినిమాలతో క్లిక్ అయినోళ్లే. మానుషి నమ్మకం కూడా అదే.

 

More

Related Stories