హరిహరపై డౌట్స్ తీరేదెప్పుడు?

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం చాలా కాలంగా ఆగుతూ ఆగుతూ సాగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. మరి ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.

మరోవైపు, ‘హరి హర వీరమల్లు’ మొత్తానికే ఆగిపోయిందని పుకార్లు.

దర్శకుడు క్రిష్ తీస్తున్న ఈ మూవీ.. ఒక చారిత్రిక చిత్రం. మొఘల్ కాలంలో సాగే కథ. ఔరంగజేబుని ఎదిరించి పోరాడే వీరమల్లు అనే గజదొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఆయన మనసు దోచుకున్న చిన్నదానిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యణ్ ఈ సినిమాలో ఫైట్స్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

నిర్మాత ఏ ఎం రత్నం కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరి ఈ సినిమాని పవన్ పూర్తి చేస్తారా? పక్కన పెడుతారా అన్నది పక్కాగా తెలియలాంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పక్కాగా క్లారిటీ ఇస్తారు.

 

More

Related Stories