బ్యాచిలర్ కి మోక్షం కలగాలంటే…!

అఖిల్ అక్కినేని నటించిన నాలుగో చిత్రం… “మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌”. ఎంతో అట్టహాసంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికీ విడుదల కాలేదు.రీషూట్ లు, లాక్డౌన్ లు ఈ సినిమాకి అడ్డంకిగా మారాయి.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ మొదలుపెట్టిన ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటివరకు వచ్చిన పాటలు కానీ, టీజర్ కానీ మెప్పించలేక పోయాయి. అందుకే, దీన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ మూవీని సినిమా థియేటర్లోనే విడుదల చేస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

అఖిల్‌ సరసన పూజాహెగ్డే నటించిన ఈ మూవీని జూన్‌ 19న విడుదల చేస్తామని ఇంతకుముందు ప్రకటించారు. ఆ డేట్ కి సినిమా విడుదల కావడం కష్టం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దసరా నాటికి అన్ని చక్కదిద్దుకుంటే ‘బ్యాచిలర్’కి మోక్షం కలగొచ్చు.

Advertisement
 

More

Related Stories