మళ్ళీ మారుతి మూవీతో బిజీ

Prabhas

ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నారనే విషయం మనకి తెలుసు. ఒక వారం “ప్రాజెక్ట్ కే” సెట్ లో, మరికొన్నాళ్లూ “సలార్” సెట్ లో కనిపిస్తున్నారు ప్రభాస్. మొత్తానికి ఈ రెండు సినిమాల షూటింగ్ లు చివరి దశకు చేరుకున్నాయి.

ఇక ప్రభాస్ దర్శకుడు మారుతి తీస్తున్న సినిమా షూటింగ్లో ఏప్రిల్ 3 నుంచి పాల్గొంటారు. కొంత భాగం చిత్రీకరణ తర్వాత మళ్ళీ “సలార్” సెట్ కి వెళ్లి అది పూర్తి చేసి వస్తారు.

ప్రభాస్ తో ఒక హారర్ కామెడీ మూవీ తీస్తున్నారు మారుతి. ఐతే, ప్రభాస్ ఇమేజ్, స్థాయికి తగ్గట్లే ఈ హారర్ కామెడీ భారీగా, కొత్తగా ఉంటుందట. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా థ్రిల్ అయ్యేలా ఉంటుంది అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో చిన్న పాత్రలో రిద్ది నటిస్తోంది.

“ఆదిపురుష్” (జూన్ 16), “సలార్” (సెప్టెంబర్ 28), “ప్రాజెక్ట్ కే” (జనవరి 2024 లేదా ఏప్రిల్ 2024) సినిమాలకు విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి. ఈ సినిమాకి మాత్రం ఇంకా అటువంటి ప్లాన్ లేదు. 2024 చివర్లో విడుదల కావొచ్చు.

Advertisement
 

More

Related Stories