అక్టోబర్ నుంచి మారుతీ మూవీ!

Maruthi

ఇప్పటికే తేజ, ప్రశాంత్ వర్మ, క్రిష్, సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకుడు ఓటీటీలోకి ఎంటరయ్యాడు. వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మారుతి కూడా ఎంటరయ్యాడు. తన కాన్సెప్ట్ తో త్వరలోనే ఓ వెబ్ సిరీస్ వస్తుందంటున్నాడు ఈ దర్శకుడు.

“నేను కూడా వెబ్ సిరీస్ లోకి ఎంటరయ్యాను. ఆహా ఓటీటీకి ఓ కాన్సెప్ట్ ఇచ్చాను. నా రైటర్ రవి దానికి డైలాగ్స్ రాస్తున్నాడు. దాని పేరు త్రీ-రోజెస్. కాస్టింగ్ ఏమీ అనుకోలేదు. 5 ఎపిసోడ్స్ రైటింగ్ అయింది, మరో 3 ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత నటీనటుల ఎంపిక. ఆహా కాకుండా నెట్ ఫ్లిక్స్ వాళ్లు కూడా అడిగారు. లెక్కప్రకారం లస్ట్ స్టోరీస్ తెలుగు నేనే చేయాలి. కరోనాకు ముందు అడగడం వల్ల కాదన్నాను.”

ఇలా తన ఓటీటీ ఎంట్రీపై స్పందించాడు మారుతి. మరోవైపు సినిమాలపై కూడా రెస్పాండ్ అయ్యాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో 4 కథలు రాసుకున్నాడట ఈ దర్శకుడు. వీటిలో ఏ కథతో సెట్స్ పైకి వెళ్తాననేది చెప్పలేనంటున్నాడు. అక్టోబర్ నుంచి మాత్రం కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తానంటున్నాడు.

గతేడాది మారుతి తీసిన “ప్రతిరోజు పండగే” సూపర్ హిట్ అయింది. కానీ హీరో విషయంలోనే మారుతికి చిక్కు వచ్చింది. అందరూ హీరోలు ఆల్రెడీ వేరే సినిమాలతో కమిట్ అవడంతో …. నెక్స్ట్ మూవీ ఇప్పటివరకు అనౌన్స్ చెయ్యలేక పోయాడు.

Related Stories