అనుష్కకు మద్దతుగా మారుతి

- Advertisement -
Anushka Sharma

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు మద్దతుగా నిలిచాడు దర్శకుడు మారుతి. ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అదేంటి.. అనుష్క శర్మకు మారుతికి సంబంధం ఏంటి.. అసలు వీళ్లిద్దరూ ఎప్పుడైనా కలిశారా అనే అనుమానాలు వద్దు. ఇదంతా ఆన్ లైన్ వ్యవహారం.

తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని గతంలోనే ప్రకటించింది అనుష్క శర్మ. తాజాగా తన గర్భంతో దిగిన ఓ ఫొటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్లంతా తమ బేబీ బంప్ ను ఇలా చూపించుకోవడం కొత్తేంకాదు. అనుష్క కూడా అదే పని చేసింది. కానీ దానిపై విమర్శలు చెలరేగాయి.

విరాట్ కోహ్లి కేవలం నిన్ను గర్భవతిని మాత్రమే చేశాడు.. ఇంగ్లాండ్ కు రాణిని చేయలేదు.. ఎక్కువగా ఆవేశపడకు అంటూ ఒకరు విమర్శించారు. మరొకరు స్పందిస్తూ.. ఇప్పుడు ఇలానే వీళ్లు తమ గర్భాన్ని చూపిస్తారని బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆశీర్వదించడానిక్కూడా టచ్ చేయనివ్వరని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ పడుతుంటే.. మారుతి మాత్రం అనుష్కకు మద్దతుగా నిలిచాడు.

అమ్మతనం అనేది ఇంగ్లండ్ కు రాణి అవ్వడం కంటే గొప్ప విషయమని.. ఈ విషయంలో ప్రతి తల్లి, మహారాణితో సమానమేనని.. ప్రతి ఇల్లు రాజ్యమేనని కామెంట్ చేశాడు మారుతి. సెలబ్రిటీ కంటే ముందు అనుష్క కూడా ఓ మహిళ అనే విషయాన్ని అంతా గుర్తించాలని, తన అమ్మతనాన్ని చూపించుకునే హక్కు ఆమెకు ఉందని సమర్థించాడు.

More

Related Stories