
తన కొత్త సినిమా ఏంటి అనేది ప్రకటించకుండా… మిగతా విషయాలు అన్ని మాట్లాడుతున్నాడు దర్శకుడు మారుతి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. లాక్ డౌన్ ఈయన మైండ్ సెట్ ను మార్చేసిందట. ఇకపై గతంలా ఉండదంటున్నాడు ఈ డైరక్టర్.
“కరోనా కారణంగా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని నా వరకు నేను క్రియేటివ్ గా మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకున్నాను. స్టోరీ డిస్కషన్స్ చేశాను. కొన్ని కొత్త కథలు రాసుకున్నాను. ఇంతకుముందులా ఒక స్టోరీ తరువాత మరో స్టోరీ ని రెడీ చేసే పద్ధతి నుంచి కొంచెం బయటపడ్డాను. ఇప్పుడు నా చేతిలో 3-4 కథలు ఉన్నాయి, అన్నీ సెట్స్ మీదకి తీసుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.”
ఇలా తన యాక్షన్ ప్లాన్ మొత్తం బయటపెట్టాడు మారుతి. త్వరలోనే గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై జాయింట్ గా ఓ సినిమా చేస్తానని ప్రకటించిన ఈ దర్శకుడు.. అదే సమయంలో మరో సినిమా కూడా స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.ఇంతకీ హీరో ఎవరు అన్న విషయం చెప్పడం లేదు. రవితేజతోనే ఉంటుంది అనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.