ఇక మాస్ ఊపు!

Skanda

“అఖండ” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బోయపాటి తీస్తున్న కొత్త చిత్రం… స్కంద. దీనికి “ది ఎటాకర్‌” అనే ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. రామ్ అంటే మ.. మ… మాస్. ఇక బోయపాటి పేరు చెపితే ఊర మాస్ అనే పదం గుర్తొస్తుంది. ఈ ఇద్దరు వీర మాస్ సెలెబ్రిటీల కాంబినేషన్ లో వస్తున్న పాటలు కూడా అలాగే ఉంటాయట.

ఇంతకుముందు “నీ చుట్టూ చుట్టూ” అనే ఒక డ్యాన్స్ పాట విడుదలైంది. ఐతే, అసలైన మాస్ పాట ఇప్పుడు చూడబోతున్నమంట.

ఆగస్ట్ 18న స్కంద సెకండ్ సింగిల్ వస్తుంది. “గందారబాయ్” అనే ఈ పాట మాస్ కి కిక్ ఇస్తుంది,” అని మేకర్స్ ప్రకటించారు. అసలైన మాస్ పాట ఇదే అని రామ్ కూడా ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుందట. సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది ‘స్కంద’.

Advertisement
 

More

Related Stories