మాస్టర్ నిర్ణయం నిజంగా షాకే

Master

‘మాస్టర్’ సినిమా రెండు వారాలకే డిజిటల్ రిలీజ్ కి వచ్చింది. జనవరి 13న దేశమంతా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలయింది. సినిమా బాగానే ఆడింది. కొన్నవాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్లా ఇంకా ఆడుతోంది. కానీ విడుదలైన 16 రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతోంది. ఒక విధంగా ఇది థియేటర్ల వ్యాపారానికి దెబ్బ.

ఇకపై పెద్ద సినిమాలన్నీ రెండు వారాలకే డిజిటల్ లో విడుదల చేస్తే… ఫ్యాన్స్ తప్ప మిగతావారెవ్వరూ థియేటర్ల వైపు చూడరు. రెండు వారాలు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అనుకోవడం ఖాయం.

‘మాస్టర్’ నిర్మాతలకు అమెజాన్ భారీ మొత్తం ఇచ్చింది. అందుకే, వాళ్ళు థియేటర్ల యజమానుల గురించి పట్టించుకోలేదు.

మిగతా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ సినిమాలు కూడా ఇదే పద్దతిలో వెళ్తే, థియేటర్ల, మల్టీప్లెక్సుల మునుగడ కష్టం అవుతుంది. ప్రతివారం జనాలని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న కొత్త సినిమాలు రావాలి. లేదంటే అంతే సంగతులు. వచ్చే ఏడాదికి ఇప్పుడున్న చాలా సింగిల్ థియేటర్లు క్లోజ్ అవుతాయని అంచనా.

కొన్ని చోట్లా ఇప్పటికే పేరొందిన మల్టిప్లెక్స్ లు కూడా వ్యాపారాన్ని క్లోజ్ చేశాయి.

More

Related Stories