
విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” సినిమాని హిందీలో కూడా హడావిడిగా రిలీజ్ చేశారు. కానీ సినిమాని హిందీ ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇండియా మొత్తం ఈ సినిమా రెండు రోజులకుకలిపి 35 లక్షలు రూపాయలు కలెక్ట్ చేసింది. అంటే, అక్కడ ఎవ్వరూ ఖాతరు చెయ్యలేదు.
విజయ్ కి మొన్నటివరకు సాలిడ్ గా తమిళనాడు, కేరళలో మాత్రమే మార్కెట్ ఉండేది. గత రెండేళ్లుగా తెలుగునాట కూడా మార్కెట్ పెరిగింది.
తెలుగునాట “మాస్టర్”తో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ కూడా రాబట్టుకున్నాడు విజయ్. ఐతే, హిందీ మార్కెట్ లో కూడా పాగా వేసి మరో రజినీకాంత్ కావాలనుకున్నాడు. కానీ, విజయ్ గేమ్ పని చెయ్యలేదు.
హిందీలో ఎలాగూ ఎవరూ చూడడడం లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తారట. మురాద్ కేతాని, ఎండోమెల్ ఇండియా కలిసి రీమేక్ చేస్తామని ప్రకటించాయి. దీన్ని రీమేక్ చెయ్యాల్సినంత మేటర్ ఏముందో కొన్న నిర్మాతలకు తెలియాలి.