మాస్టర్ ఊగిసలాట

Master

విజయ్ అంటే మ…మ…మాస్. తమిళనాట, కేరళలో థియేటర్లో విజయ్ బొమ్మ పడితే కలెక్షన్లు దద్దరిల్లుపోతాయి. ఈ కరోనా కష్టకాలంలో మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం రావాలి అంటే, జనం థియేటర్ల బాట పట్టాలంటే విజయ్ లాంటి మాస్ హీరోల సినిమాలు థియేటర్లోనే రిలీజ్ కావాలనేది డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబిటర్ల మాట.

విజయ్ కూడా అదే ఆలోచనతో తన కొత్త సినిమా “మాస్టర్” విడుదలని ఏప్రిల్ నుంచి స్టాప్ చేశాడు. ఐతే, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని అయిపోయిన ఈ మూవీ రిలీజ్ ని ఇంకా ఎంతకాలం ఆపాలి అనే విషయంలో నిర్మాతలకు ఊగిసలాట మొదలైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్మారు. ఐతే, థియేటర్లో మొదట సినిమా విడుదలైన తర్వాతే డిజిటల్ రిలీజ్ అనే పద్దతిలో అమ్మారు.

ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ కి రైట్స్ ఇవ్వండి అంటూ డిజిటల్ కంపెనీలు వెంట పడుతున్నాయి. ఈ సంక్రాంతికి ఓటిటిలోనే “మాస్టర్”ని రిలీజ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతకు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందిట. దాంతో ఈ సినిమా రిలీజ్ మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చింది.

విజయ్ మాత్రం ఇప్పటికీ థియేటర్లోనే ముందు విడుదల చెయ్యాలని అంటున్నాడు. ఏది ఏమైనా సంక్రాంతికి ఈ సినిమా ఓటిటిలోనో, థియేటర్లోనో రావడం గ్యారెంటీ.

More

Related Stories