
“ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ” సినిమా దర్శకుడు స్వరూప్ తన రెండో సినిమాని ప్రకటించాడు. “మిషన్ ఇంపాజిబుల్” అనే టైటిల్ తో కూడిన మొదటి పోస్టర్ ని శనివారం (డిసెంబర్ 12) నాడు విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో హనుమంతుడు, శివుడు, శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ముగ్గురు పిల్లల చేతుల్లో గన్స్ ఉన్నాయి. ఐతే, ఈ పోస్టర్ పై వివాదం రేగింది.
హిందూ దేవుళ్ళ చేతిలో గన్స్ పెడతారట అని కొన్ని సంఘాలు అభ్యంతరం తెలపడంతో సాయంత్రానికి పోస్టర్ ని వాపస్ తీసుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని పేర్కొంది.
తిరుపతి సమీపంలోని ఓ గ్రామంలో నిధి అన్వేషణ నేపథ్యంలో నడిచే కథ ఇది. కథలో భాగంగా వచ్చే ఒక నాటకం సీన్ కి సంబదించిన స్టిల్ ని మొదటి పోస్టర్ గా విడుదల చేసింది టీం.