మీనా ‘గర్ల్ గ్యాంగ్’తో సెలబ్రేషన్


మీనా లేట్ వయసులో హీరోయిన్ గా బిజీ అయింది. ‘దృశ్యం’ సినిమా వల్ల ఆమె మళ్ళీ హీరోలకు ‘భార్య’ పాత్రలు దక్కించుకుంటోంది. సీనియర్ హీరోలకు జోడిగా మారింది. దాంతో, ఆమె కెరియర్ కొత్త టర్న్ తీసుకొంది.

అందుకే, మీనా చాలా ఖుషీగా ఉంది. ఇప్పుడు ఆమె సంపాదన కూడా బాగుంది. అందుకే, ఇప్పుడు బర్త్ డేలను ఘనంగా జరుపుకుంటోంది.

రీసెంట్ గా తన 45వ పుట్టిన రోజు వేడుకలను చెన్నెలోని ఒక స్టార్ హోటల్ ల్లో సెలెబ్రేట్ చేసింది. ఈ పార్టీకి కేవలం తన స్నేహితురాళ్ళని మాత్రమే ఆహ్వానించింది. 15 మంది వచ్చారు. అందరూ గర్ల్ ఫ్రెండ్స్. ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె గర్ల్ గ్యాంగ్ లో ఒకప్పటి హీరోయిన్ల అయిన స్నేహ, కన్హా వంటి వారు కూడా ఉన్నారు.

వెంకటేష్, మీనా నటించిన ‘దృశ్యం 2’ త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. అలాగే, రజినీకాంత్ నటించిన ‘అన్నత్థే’ సినిమాలో కూడా మీనా హీరోయిన్ గా నటించింది.

 

More

Related Stories