
కరోనా మూడో వేవ్ మొదలైంది. సినిమా పరిశ్రమ మరోసారి విలవిలాడుతోంది. పెద్ద సినిమాలన్నీ వాయిదాల బాట పట్టాయి. అలాగే, సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
కమల్ హాసన్, మంచు విష్ణు, విశ్వక్ సేన్, కరీనా కపూర్ వంటి సెలెబ్రిటీలు ఇటీవల కరోనా బారిన పడ్డారు. తాజాగా మీనా తన వంట్లోకి, తన ఇంట్లోకి కోవిడ్ కి స్వాగతం పలికింది.
ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారట. సోషల్ మీడియా వేదికపై ఈ విషయాన్నీ మీనా తెలిపారు. “2022లో మా ఇంటికి తొలి అతిథి… కరోనా. దానికి మా కుటుంబము మొత్తం నచ్చింది. కానీ దాన్ని మా ఇంట్లో తిష్ట వెయ్యనివ్వను. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా మెలగాలి. మరింతగా వ్యాప్తి చెందకుండా చూడాలి.,” అని రాసుకొంది.
మీనా ఇప్పటికీ హీరోయిన్ వేషాలు వేస్తున్నారు. “దృశ్యం 2″లో వెంకటేష్ సరసన భార్యగా నటించారు.