ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఉన్న మీనా ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఆమెకిప్పుడు 47 ఏళ్ళు. ఆమె భర్త ఇటీవలే కన్ను మూశారు. ఐతే, ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ పుకారు ఏంటంటే… తమిళ హీరో ధనుష్ తో ఆమె ప్రేమలో ఉందని. అంతే కాదు, 47 ఏళ్ల మీనాని 40 ఏళ్ల ధనుష్ పెళ్లి చేసుకోబుతున్నాడు అని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవి చదివిన చాలా మంది షాక్ తిన్నారు. అసలు వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి, పెళ్లి ఏంటి అని అందరూ స్టన్ అయ్యారు.
మనమంతా ఎలా ఫీల్ అయినా మీనా మాత్రం చాలా బాధ పడిందట. ఆ రూమర్స్ చదివి అలా ఎలా రాస్తారని ఆవేదన చెందిందట.
తాను రెండో పెళ్లి చేసుకుంటానో లేదు తెలియదు కానీ ఇలాంటి పుకార్లు మాత్రం తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతాయని అంటున్నారు మీనా. హీరోయిన్ గా ఎన్నో రూమర్స్ చూశాను కాబట్టి తాను అవి పట్టించుకోను కానీ తన కూతురు, ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఉంటుంది అని చెప్తున్నారు ఆమె.