మళ్ళీ మీనా టైమొచ్చింది!

Meena

మీనా ఇప్పుడు 40 ప్లస్ ఏజ్ లో ఉంది. అంటే క్యారక్టర్ పాత్రలోకి మారిపోవాల్సిన వయసు. కానీ ఆమె ఇప్పటికీ హీరోయిన్ గానే నటిస్తోంది. ‘దృశ్యం 2’. సినిమా సక్సెస్ తో మీనా సాగర్ కి మరింత క్రేజ్ పెరిగింది. ‘దృశ్యం 2’ సినిమాలో మోహన్ లాల్ భార్యగా నటించింది. ఇద్దరు ఎదిగొచ్చిన కూతుళ్ళకు తల్లి పాత్రనే. కానీ, ఈ రోల్ కూడా ఆమెకి పేరు తెచ్చింది. ఇప్పుడు అదే తెలుగు రీమేక్ లో కూడా మీనా నటించనుంది.

మోహన్ లాల్, వెంకటేష్, రజినీకాంత్ వంటి హీరోలతో 90లలో హీరోయిన్ గా నటించింది మీనా. 20 ఏళ్ల తర్వాత వాళ్ళ సినిమాల్లో మళ్ళీ హీరోయిన్ గానే కనిపిస్తుండడం విశేషం. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాదు కానీ ఆ హీరోలకి భార్యగానే కనిపిస్తోంది.

‘దృశ్యం 2’ విడుదలైన తర్వాత ఆమెకి యాడ్స్ కూడా పెరిగాయి. లేటెస్ట్ గా ఆమె రెండు బ్రాండ్స్ ఒప్పుకొంది. అది ఆమెకి పెరిగిన క్రేజ్.

More

Related Stories