నో వెడ్డింగ్, ఓన్లీ యాక్టింగ్!

భర్త చనిపోయిన తర్వాత మీనా ఇంకో పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోబోతుంది అని ముహుర్తాలు ఫిక్స్ చేసింది తమిళ మీడియా. ఐతే, మీనా వాటిని తోసిపుచ్చింది. హీరోయిన్లని చులకనగా చూసే ధోరణి వల్లే ఇలాంటి అబద్దాలను వండి వస్తున్నారు అని మండిపడింది మీనా.

ఆమె రెండో పెళ్లి సంగతి పక్కన పెడితే, హీరోయిన్ గా మాత్రం మళ్ళీ బిజీ అవుతోంది. భర్త చనిపోయిన మూడు నెలలకే ఆమె సెట్స్ పైకి వచ్చింది. ఇప్పుడు మలయాళ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

ఆమె ప్రస్తుతం ఇప్పుడు సీనియర్ హీరోలకు భార్యగా నటిస్తోంది. అలాగే తల్లి పాత్రలు చేస్తోంది. కానీ తెలుగులో ఇంకా తల్లి పాత్రలకు షిఫ్ట్ కాలేదు. తమిళంలో టీవీ తెరపైకి కూడా వచ్చింది.

Meena

ఐతే, ఆమెకిప్పుడు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న ఇండస్ట్రీ మాత్రం… మళయాళ పరిశ్రమే.

 

More

Related Stories