మీనాక్షి ఆశలు గల్లంతు

Meenakshi Chaudhary

మహేష్ బాబు వంటి పెద్ద హీరో సరసన అవకాశం రావడంతో ఆమె తన అదృష్టం మారింది అనుకొంది. అది కూడా త్రివిక్రమ్ సినిమా కావడంతో చాలా ఎక్కువ ఆశలు నిర్మించుకొంది మీనాక్షి చౌదరి. అందుకే “గుంటూరు కారం” విడుదలకు ముందు ఆమె చాలా ఎక్కువగా మాట్లాడింది.

కానీ, విడుదల తర్వాత ఆమెకి కేవలం విమర్శలు వచ్చాయి. ఎందుకంటే, ఈ సినిమాలో ఆమె పాత్ర మరీ ఘోరం. గతంలో త్రివిక్రమ్ తన సినిమాల్లో రెండో హీరోయిన్ గా నటించిన హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు, కనీసం హీరోతో ఒక పాట అయినా తీశారు. కానీ, ఇందులో ఆమెది మరీ సైడ్ క్యారెక్టర్.

మీనాక్షి ఈ సినిమాలో మూడో, నాలుగు సీన్లలో కనిపిస్తుంది. మహేష్ బాబు మరదలు పాత్ర. కానీ ఆమె కనిపించిన ఆ కొన్ని సీన్లలో ఆమె చేసింది ఏంటి అంటే బట్టలు మడతపెట్టడం, హీరో మందు వేసుకుంటే ఆమ్లెట్ ఇవ్వడం. ఈ మాత్రం పాత్రకి ఏ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరిపోతుంది. మీనాక్షి తీసుకొని ఇలాంటి సీన్లు తీయడం అంటే తప్పే కదా.

అందుకే, సినిమా విడుదల తర్వాత మీనాక్షికి ఎలాంటి హెల్ప్ కాలేదు. పెద్ద హీరో, పెద్ద దర్శకుడి మూవీలో చేశానన్న తృప్తి తప్ప మిగిలింది ఏమి లేదు.

Advertisement
 

More

Related Stories