మీనాక్షికి మొదటి హిట్!

అందాల పోటీలో నిలబడి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి నటించిన మొదటి సినిమా గతేడాది విడుదలైంది. ఏడాది తర్వాత ఆమెకి మొదటి హిట్ దక్కింది. ‘హిట్ 2’ సినిమాలో మీనాక్షి హీరోయిన్. అలా ఆమెకి మొదటి సక్సెస్ లభించింది.

‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో ఈ భామ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడీ’సినిమాలో కనిపించింది. రెండూ ఢమాల్. దాంతో, ఆమెకి కొత్తగా అవకాశాలు రాలేదు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే ఒప్పుకున్న ‘హిట్ 2’ ఇప్పుడు విడుదలైంది. ఇది హిట్ కావడంతో ఊపిరి పీల్చుకొంది ఈ డెంటల్ డాక్టర్.

ఈ భామ ఇటీవలే తమిళ చిత్రరంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.

ముద్దు సీన్లకు అబజెక్షన్ చెప్పదు ఈ భామ. ఇప్పుడు హిట్ కూడా దక్కింది కాబట్టి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.

 

More

Related Stories