
ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ కి అదృష్టం కలిసి వస్తుంది. ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి పూజ హెగ్డే తప్పుకుంటుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ ఆమె వెళ్లిపోయేలా చేసింది ఈ సినిమా టీం. దాంతో, పూజ హెగ్డే తప్పుకోగానే మీనాక్షి చౌదరికి జాక్ పాట్ దక్కింది.
పూజ హెగ్డే స్థానంలో శ్రీలీల వచ్చింది. అంటే ఈ సినిమాలో ఆమె ఇంతకుముందు రెండో హీరోయిన్. కానీ ఇప్పుడు ఆమె మెయిన్ హీరోయిన్ అయింది. దాంతో, శ్రీలీల స్థానంలో రెండో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని ఈ టీం తర్జన భర్జన పడింది. ‘ఏజెంట్’లో నటించిన సాక్షి వైద్య, మాళవిక మోహనన్, ఫరియా అబ్దుల్లా వంటి భామలని పరిశీలించారు.
కానీ చివరికి ఆ పాత్ర మీనాక్షి చౌదరికి దక్కింది. ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది.
మీనాక్షి చౌదరికి ఇది నిజంగా పెద్ద ఆఫర్. ఆమె ఇప్పటివరకు తెలుగులో మూడు చిత్రాలు చేసింది. అయినా ఆమెకి పెద్దగా పాపులారిటీ లేదు. సామాన్య జనానికి తెలియదు. ‘గుంటూరు కారం’లో రెండో హీరోయిన్ పాత్రతోనే ఆమె సామాన్య ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు ఎక్కువ.