ఈ ఏడాదిలోనే పెళ్లి – మీరా చోప్రా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మీరా చోప్రా. ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే స్థాయిలో వివాదాలు కూడా రేపుతుంది. బహుశా, అందుకే ఆమెకు అంత ఫాలోయింగ్ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు వివాదాలు రేపే ఈ బ్యూటీ, తాజాగా తన పెళ్లిపై స్పందించింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.

తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో చాటింగ్ చేసింది మీరా చోప్రా. ఛాటింగ్ లో భాగంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ఓ నెటిజన్, మీరాను ప్రశ్నించాడు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేక లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉంటావా అని కాస్త గట్టిగానే అడిగాడు. దీనిపై స్పందించిన మీరా, ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అంటే, మిగిలిన ఈ 6 నెలల్లోనే మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతోందన్నమాట.

ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటుంది మీరా చోప్రా. తెలుగు హీరోలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, పనిలోపనిగా కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తుంది. బంగారం, వాన సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది మీరా.

 

More

Related Stories