మీరా జాస్మిన్ రీ-ఎంట్రీ!

Meera Jasmine

ఒకప్పుడు మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్. పవన్ కళ్యాణ్, విక్రమ్, రవితేజ, విశాల్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది. తెలుగు, తమిళ సినిమారంగాల్లో క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టిందట. ఎందుకంటే ఆమె తన భర్త నుంచి విడిపోయింది. సో.. సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు చెయ్యాలనుకుంటుందట.

ఒకప్పుడు మీరా జాస్మిన్ బొద్దుగా ఉండేది. ఇప్పుడు బాగా చిక్కిపోయింది. ఈ లేటెస్ట్ ఫోటో చూస్తే ఆమెని గుర్తు పట్టలేరు. అంతగా మారిపోయింది.

కేరళకి చెందిన మీరా జాస్మిన్ తెలుగులో ‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి సినిమాల్లో నటించింది. రన్, పందెంకోడి వంటి తమిళ్ హిట్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.

ఇప్పటికే మలయాళంలో ఒక మూవీ చేస్తోంది. అదే ఆమె రీఎంట్రీ మూవీ కానుంది.

More

Related Stories