
40 ప్లస్ ఏజ్ లో గ్లామర్ పాత్రలు కోసం చూస్తోంది మీరా జాస్మిన్. ఆమె హీరోయిన్ గా వెలుగొందిన కాలంలో పక్కింటి అమ్మాయి పాత్రలే చేసింది. ‘భద్ర’, ‘గుడుంబా శంకర్’, ‘అమ్మాయి బాగుంది’, ‘రన్’, ‘పందెం కోడి’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె పెద్దగా గ్లామర్ వొలకబోయలేదు. కానీ ఇప్పుడు ఆమె గ్లామరస్ గా మారింది.
పదేళ్ల క్రితం పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్లిన మీరా జాస్మిన్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న మీరా ఇప్పుడు సన్నబడింది. ఆల్కహాల్ వ్యసనం నుంచి కూడా బయటపడినట్లు ఉంది. 40 ప్లస్ లో కూడా తన సొగసు తగ్గలేదు అన్నట్లుగా చూపేందుకు మీరా జాస్మిన్ ఈ మధ్య గ్లామరస్ ఫోటోషూట్ లు చేస్తోంది.
ఇటీవలే ఆమె ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఫోటోలు షేర్ చేస్తోంది.
ALSO CHECK: Meera Jasmine’s ultra glam avatar
మలయాళంలో అయితే ఆమెకి ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. మరి తెలుగులో ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి. పాత తరం హీరోయిన్లకు మంచి పాత్రలు ఇచ్చే దర్శకులు టాలీవుడ్ లో కొందరున్నారు. మరి వారు మీరాని తెలుగులోకి మళ్ళీ తీసుకొస్తారా?