సూర్య, విజయ్ నటనలో వీకా!

vijay surya

ఈమధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. స్టార్ స్టేటస్ ఉన్న హీరోల్ని తిడితే ఆటోమేటిగ్గా అందరి దృష్టి తమపై పడుతుందనేది కొంతమంది పిచ్చి లాజిక్. ఈ లాజిక్ తో టాలీవుడ్ లో కొంతమంది పాపులర్ అయ్యారు కూడా. ఇప్పుడిదే పద్ధతి ఫాలో అవుతోంది తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్. సూర్య, విజయ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ లేకపోతే సూర్య, విజయ్ ఎందుకూ పనికిరారని విమర్శించింది మీరా మిధున్. కేవలం నెపొటిజం వల్లనే వీళ్లిద్దరూ హీరోలు అయ్యారని ఆరోపించిన మీరా, సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా వీళ్లకు లేదని విమర్శించింది. ఇద్దరూ యాక్టింగ్ లో తన రేంజ్ లో కూడా నటించారని గొప్పలు చెప్పుకొంది.

స్టార్స్ పై విమర్శలు చేయడం మీరాకు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు హీరోయిన్ త్రిషపై ఇలాంటి విమర్శలే చేసింది. త్రిషకు కులపిచ్చి ఎక్కువని కామెంట్ చేసింది. ఇప్పుడు సూర్య, విజయ్ ని టార్గెట్ చేసింది.

Related Stories