ఆ ఇంట్లో ‘మెగా’ సంబరం

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో తాతయ్య అయ్యారు. ఆయన కూతుళ్లు ఇద్దరికీ పిల్లలు చాలా ఏళ్ల క్రితమే పిల్లలు కలిగారు. అలా గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ఐతే, రామ్ చరణ్ కి పిల్లలు లేకపోవడం విషయంలో మాత్రం ఒక వెలితి ఆయనలో కనిపించేది. అది ఇప్పుడు తీరిపోతోంది.

పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య ఉపాసన బాగా ఒత్తిడి అనుభవించారు. అందరూ పిల్లల గురించే అడుగుతున్నారు అని ఆ మధ్య ఆమె ఒక సమావేశంలో బహిరంగంగా మాట్లాడారు. పెళ్ళైన పదేళ్ల తర్వాత పిల్లలు కలగకపోతే సహజంగానే భారతీయ కుటుంబాల్లో అదొక పెద్ద సమస్యగా మారుతుంది. పూజలు, దీక్షలు మొదలుపెడతారు మనవాళ్ళు. చిరంజీవి భార్య సురేఖ కూడా అనేక పూజలు చేశారు. ఇప్పుడు ఉపాసన, రామ్ చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు అన్న వార్త వారింట్లో అవధుల్లేని ఆనందాన్ని తెచ్చి పెట్టింది.

ఇక మెగాస్టార్ ఇంట్లో సంబరాలు జరగనున్నాయి. ప్రస్తుతం చిరంజీవి, సురేఖ, వారి కూతుళ్లు, మనవరాళ్లు…అందరూ యూరోప్ లో ఉన్నారు. అక్కడ ‘వాల్తేర్ వీరయ్య’ షూటింగ్ కోసం చిరంజీవి వెళ్లారు. తనతో ఫ్యామిలీని వెకేషన్ కి తీసుకెళ్లారు చిరంజీవి.

Ram Charan and Upasana

హైదరాబాద్ కి రాగానే మెగాస్టార్ ఇంట్లో పార్టీలే పార్టీలు.

 

More

Related Stories