మెగా ఫ్యాన్సా? మెగా డైరెక్టర్లా?

Meher Ramesh, VV Vinayak and Bobby
Directors Meher Ramesh, VV Vinayak and Bobby

కొన్ని సెల్ఫీలు ఆసక్తి రేపుతాయి. అలాంటిదే… ఇది. వినాయక్, మెహర్ రమేష్, బాబీ… ముగ్గురూ కలిసి సెల్ఫీ దిగారు. ఈ ముగ్గురూ త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయబోతున్నారు అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదా.

వీరు ముగ్గురు కలిసి ఫోటో దిగిన సందర్భం… ఈ రోజు వినాయక్ బర్త్ డే. సో అలా కలిశారు. ఐతే, తమని తాము మెగా ఫాన్స్ గా అభివర్ణించుకున్నాడు మెహెర్ రమేష్. మెహర్ రమేష్… ఇప్పటివరకు ఎన్టీఆర్, వెంకటేష్, ప్రభాస్ లతో మాత్రమే సినిమాలు చేశాడు. ఇక రియల్ లైఫ్ లో మహేష్ బాబుకి క్లోజ్ ఫ్రెండ్. కానీ మెగా హీరోలతో ఇంతవరకు చెయ్యలేదు. ఐతే మెగాస్టార్ కి బంధువు అతను. కాబట్టి వేరే హీరోలతో సినిమాలు చేసినా, వారితో బంధం ఉన్నా … తనని తాను మెగా ఫ్యాన్ గా ముద్ర వేసుకున్నాడు.

తమిళంలో సూపర్ హిట్టయిన “వేదలమ్” సినిమాని చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ తీయబోతున్నాడు. ఇది పక్కాగా కన్ఫర్మ్ అయింది.

ఇక వినాయక్ గురించి చెప్పక్కర్లేదు. చిన్నప్పటినుంచే …చిరంజీవి అభిమాని. రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ ఉంది. కానీ బేసికల్ గా వినాయక్ చిరంజీవి అభిమాని. అలాగే, మెగాస్టార్ తో “ఠాగూర్”, “ఖైదీ నంబర్ 150” సినిమాలు తీశాడు. ఇప్పుడు వినాయక్ కెరీర్ డౌన్ లో ఉంది. అయినా… చిరంజీవి వినాయక్ కి “లూసిఫెర్” రీమేక్ అప్పచెప్పాడు. ఇది కూడా కన్ఫర్మ్ అయింది.

ఫ్రేమ్ లో ఉన్న మూడో వ్యక్తి… బాబీ. ఈయన సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ …. బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తాను అని చిరంజీవి మీడియా ముఖంగా చెప్పాడు.

సో… వీళ్ళు మెగాస్టార్ అభిమానులు ఐతే కావొచ్చు కానీ ఇప్పుడు వీరు మెగాస్టార్ డైరెక్టర్లు.

Related Stories