నెలకో మెగా హీరో మూవీ

నెలకో మెగా హీరో మూవీ

మెగా హీరోలందరూ ఈ ఏడాది రేసులో ఉన్నారు. మార్చి నెల తప్పిస్తే ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు నెలకో మూవీ విడుదల కానుంది. మెగా కుటుంబంలో డజను వరకు నటులున్నారు మరి. ఈ నెల 12న ‘ఉప్పెన’ వస్తోంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ రిలీజ్ కానుంది. మే నెలలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ వస్తుంది. ఇక జూన్ 2న దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రిపబ్లిక్’ కూడా బరిలోకి దిగింది. డిసెంబర్లో సాయి తేజ్ ‘సోలో బ్రతుకు సో బెటర్’ అని మన ముందుకొచ్చాడు. ఆరు నెలల గ్యాప్ లోనే ఇంకోటి విడుదల చేస్తున్నాడు.

జులైలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ‘గని’, ఆగస్టు 13న అల్లు అర్జున్ నటిస్తున్న పాన్-ఇండియా మూవీ ‘పుష్ప’ విడుదల కానున్నాయి. అనుకున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా రూపొందుతోన్న ‘రీమేక్’ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కావొచ్చు. ఇక ఫైనల్ గా రాజమౌళి తీస్తున్న మెగా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ అక్టోబర్ 13న థియేటర్లను షేక్ చేయనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. 

More

Related Stories