మెగా షూటింగ్ లు వాయిదా!

Varun Tej and Ram Charan

రామ్ చరణ్, వరుణ్ తేజ్… ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఈ మెగా సోదరులు ఇప్పుడు ఇంటివద్దే క్వారెంటైన్లో ఉన్నారు. రాజమౌళి డైరెక్క్షన్ లో రూపొందుతోన్న “ఆర్.ఆర్.ఆర్.” సినిమా షూటింగ్ లో జనవరి 2 నుంచి కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్ పాల్గొనాలి. కానీ అది ఇప్పుడు వాయిదా పడనుంది. మినిమమ్ పది రోజులు ఇంటివద్దే ఉండాలి. పూర్తిగా తగ్గితే.. 14 రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనొచ్చు. అంటే.. సంక్రాంతి తర్వాతే మళ్ళీ రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటాడు.

మరోవైపు, వరుణ్ తేజ్ కూడా “ఎఫ్ 3” షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో వెంకటేష్ పాల్గొంటున్నాడు. వరుణ్ తేజ్ జనవరి మొదటివారంలో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశారు. అదిప్పుడు మరింత ఆలస్యం కానుంది.

ఇటీవల ఈ హీరోలు ఒక పార్టీలో పాల్గొనడం, అక్కడే కరోనా సంక్రమించడం జరిగాయనేది టాక్.

ముందు జాగ్రత్తగా మెగాస్టార్ చిరంజీవి కూడా “ఆచార్య” షూటింగ్ కి బ్రేక్ ఇస్తారని సమాచారం.

More

Related Stories