
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎక్కువగా దానాలు చేస్తున్నారు. అవసరంలో ఉన్న ప్రతివారికీ తన వంతు సాయం అందిస్తున్నారు. గత మూడు, నాలుగేళ్లలో ఆయన కోట్ల రూపాయల సాయం అందించారు. గతంలో చిరంజీవి మనీ విషయంలోనే కొంత నెగెటివ్ మాట వినిపించేది. కానీ మెగాస్టార్ గురించి తెలిసిన వాళ్ళు, ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న హెల్ప్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మెగాస్టార్ ని పొగడక ఉండలేరు.
చిరంజీవి వందల మందికి సాయం చేశారు రీసెంట్ గా. కానీ, ఆయన అవేవి బయటికి చెప్పుకోవడం లేదు. నిత్యం ఎవరికో ఎవరికీ ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా తన సొంత కుటుంబ సభ్యులకి కూడా గొప్ప బహుమతి ఇచ్చారట.
మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని కోకాపేట్ లో స్థలం ఉంది. ఆ రెండెకరాల స్థలాన్ని చిరంజీవి ఆయన చెల్లెళ్లకు బహుమతి ఇచ్చారు. మెగాస్టార్ సతీమణి సురేఖ చిరంజీవికి ఈ సలహా ఇచ్చారట. సురేఖ గారి సలహాతో ఆయన తన సిస్టర్స్ కి కోట్ల రూపాయల విలువైన ఆ స్థలాన్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి బహుమతిగా అందించారు.
తన భార్య గొప్పదనం చెప్తూ ఈ విషయాన్ని మెగాస్టార్ ఇటీవల బయటపెట్టారు.