‘నాది రీరికార్డింగ్ హీరోయిజం కాదు’

- Advertisement -
Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. “ఇంకెన్నాళ్లు డ్యాన్సులు వెయ్యాలి. ఇంకెన్నాళ్లు ఫైట్లు చెయ్యాలి. చాల్లేరా బాబు … ఇప్పుడు నడుచుకుంటూ వెళ్లి … రీరికార్డింగ్ తో భమ్మని మన హీరోయిజం లేపేస్తే … హాయిగా వెళ్ళామా షూటింగ్ కి…. మేకప్ తుడిచేసుకున్నామా డబ్బులు ఇచ్చారా జేబులో పెట్టుకున్నామా అనుకుంటే ఎంత బాగుంటుంది… అని అప్పుడు అనిపిస్తుంది. కానీ అలా చెయ్యలేం కదా,” అని మెగాస్టార్ అన్నారు.

కానీ తనకు ఆ సౌలభ్యం లేదు అని వాపోతున్నారు మెగాస్టార్. రజినీకాంత్ ఇటీవల నటించిన “జైలర్” సినిమాలో హీరోయిజం ఎలివేషన్ సీన్లు అన్నీ అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ (రీరికార్డింగ్) స్కోర్ తో వల్లే అయ్యాయి. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొనే తనకు అలాంటి అవకాశం లేదు అన్నట్లుగా మాట్లాడారు.

తన నుంచి ప్రేక్షకులు డ్యాన్సులు కోరుకుంటారు అని అంటున్నారు మెగాస్టార్.

“అలాంటి పరిస్థితి కాదు మనది. ఆడాలి. ఫైట్లు చెయ్యాలి. ఒరిజినల్ గా మనమే చెయ్యాలి. ఒళ్ళు హూనం చేసుకోవాలి. అప్పుడు కానీ ప్రొడ్యూసర్లకు తృప్తి ఉండదు. చూసే ఆడియెన్స్ కి తృప్తి ఉండదు.. డైరెక్టర్లకు ఉండదు.. నాకూ తృప్తి ఉండదు,” అని అన్నారు.

 

More

Related Stories