మెగాస్టార్ లెక్కలు వేరు

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచిన మాట వాస్తవం. 2021లో ఆయన స్పీడ్ గా సినిమాలు పూర్తి చెయ్యాలనుకుంటున్నారట. “ఆచార్య” సినిమాని పూర్తి చేసి విడుదల చెయ్యడమే కాదు రెండు రీమేక్ చిత్రాలను ఈ ఏడాది పట్టాలెక్కిస్తారు.

“ఆచార్య” సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ మే నెలలో విడుదల కానుంది.

అలాగే, “లూసిఫర్” రీమేక్, “వేదలమ్” రీమేక్ చిత్రాలను ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇప్పటికే “లూసిఫర్” సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అది షూటింగ్ మొదలు కాగానే, “వేదలమ్” టీం తమ ప్రీ-ప్రొడక్షన్ పనులు షురూ చేస్తుంది. ఒకటి పూర్తి కాగానే ఇంకోటి సెట్స్ పైకి వచ్చేలా పక్కా ప్లానింగ్ ని సెట్ చేశాడు మెగాస్టార్.

వచ్చే ఏడాది అంటే 2021లో ‘జై లవకుశ’, ‘వెంకీ మామ’ చిత్రాల దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఇంకో సినిమాని మొదలుపెడతాడు. ఆ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇలా దాదాపు 200 కోట్ల రూపాయలు ఈ నాలుగు సినిమాలతో సంపాదించేలా లెక్కలు వేసి పెట్టారు మెగాస్టార్.

More

Related Stories