2.25 రేటింగ్ అంటే 2.25 మిలియన్!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా వసూళ్లు అందరినీ సర్ప్రైజ్ చేశాయి. అమెరికాలో కొన్ని వెబ్ సైట్లు ఇచ్చే రేటింగ్ ని బట్టి సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి అని ఒక నమ్మకం సినిమా ఇండస్ట్రీలో ఉంది. మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఇస్తేనే భారీ వసూళ్లు వస్తాయి అని అంటారు. ఎన్నో సార్లు అది తప్పని రుజువైనా ఈ వ్యవహారం నడుస్తోంది.

ఆ వెబ్ సైట్ లు ‘వాల్తేర్ వీరయ్య’కి 2.25 రేటింగ్ ఇచ్చాయి. ఇండస్ట్రీలో ఉన్న నమ్మకం ప్రకారం ఐతే ఈ సినిమా దారుణంగా పరాజయం పాలు కావాలి. కానీ, మెగాస్టార్ మూవీ ఏకంగా 2 మిలియన్ల డాలర్ల వసూళ్లు దాటేసింది. 2.2 మిలియన్ డాలర్లపైగా వస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవి వెబ్సైట్ల రివ్యూలపై ఒక సెటైర్ వేశారు.

“ఎవరినీ తప్పు పట్టడానికి కాదు కానీ ఒక జోక్ గా చెప్తాను. వెబ్ సైట్స్ 2.25 రేటింగ్ ఇచ్చాయి. 2.25 అంటే 2.25 మిలియన్స్ అని తర్వాత అర్థం అయింది,” అని చిరంజీవి చురకలు వేశారు.

ఐతే, టేకిట్ ఈజీ అని కూడా చిరంజీవి తన అభిమానులకు చెప్పారు. సినిమా హిట్ కావడంతో ఆయన ఆనందంగా ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఐదు సినిమాలు విడుదల చేస్తే అందులో మూడు సినిమాలు 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు అందుకోవడం విశేషం. అవి – ఖైదీ నంబర్ 150, సైరా, వాల్తేర్ వీరయ్య.

Advertisement
 

More

Related Stories