
చిరంజీవి ఇకపై తన సినిమాలు అన్ని ఇతర ప్రొడ్యూసర్లకే చేస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ లో తన సినిమాలన్నీ తన కొడుకు రామ్ చరణ్ నిర్మించాలనేది మొదటి ప్లాన్. “ఖైదీ నంబర్ 150”, “సైరా నర్సింహా రెడ్డి” వరకు అలాగే సాగింది. ఐతే, “సైరా” పెట్టిన పెట్టుబడి రాకపోగా 60, 70 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
అందుకే “ఆచార్య” సినిమా నుంచి రామ్ చరణ్ నిర్మాతగా తప్పుకునేలా చేసి సినిమా నిర్మాతగా బాధ్యత అంతా నిరంజన్ రెడ్డికే ఇచ్చేశారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ కి “లూసిఫర్” రీమేక్, “వేదాళం” రీమేక్ నిర్మాత అనిల్ సుంకర టీంకి అప్పగించారు. ఈ రెండు సినిమాలకు చిరంజీవికి సాలిడ్ గా రెమ్యూనరేషన్ దక్కుతుంది. “లూసిఫర్” రీమేక్ లో మాత్రం రామ్ చరణ్ కి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ ప్రెజెంటర్ గా ఉంటుంది.
మెగాస్టార్ అలా తన కొడుకు రామ్ చరణ్ కి ఇకపై ఒక్క రూపాయి లాస్ లేకుండా చేసి, ఒక సిస్టం అమల్లో పెట్టారన్నమాట.