నాగ్ కోసం చిరు వంట

- Advertisement -
Chiranjeevi and Nagarjuna

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి స్నేహితులు. అందుకే, తన మిత్రుడి టెన్షన్ తగ్గించేందుకు నాగార్జునని డిన్నర్ కి పిలిచారు చిరంజీవి. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై నాగ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆశలు కూడా ఎక్కువే పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా రిజల్ట్ గురించి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు నాగార్జున.

నాగ్ ని కూల్ చేసేందుకు… చిరంజీవి స్వయంగా ఫిష్ ఫ్రై చేసి వడ్డించారట. చిరంజీవి వంటింట్లో నాగార్జున ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరంజీవి సతీమణి సురేఖ వీరి ఫోటోని క్లిక్ మనిపించారట. చిరంజీవికి నాగార్జున థాంక్స్ చెప్పారు.

మెగాస్టార్ వంటలు బాగా చేస్తారట. గతంలో కూడా తన తల్లికి దోసెలు వేసిన వీడియోని మెగాస్టార్ పోస్ట్ చేశారు. అలాగే, తన మనవరాళ్లకు చికెన్ ఫ్రై ఎలా చెయ్యాలో నేర్పించిన వీడియోని కూడా షేర్ చేశారు.

 

More

Related Stories