రాజమౌళిపై మెగా అసంతృప్తి


“ఆర్ ఆర్ ఆర్” సినిమాతో రాజమౌళికి హాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ వచ్చింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి పేరొందిన డైరెక్టర్లు రాజమౌళి తీసిన విధానంపై ప్రశంసలు కురిపించారు. అలాగే, ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు రాజమౌళి టీం కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్ చేసింది. ఈ పబ్లిసిటీలో భాగంగా పేరొందిన పత్రికలు, వెబ్ సైట్ లలో ఎన్టీఆర్ ని ఎక్కువగా హైలెట్ చేశారు అనే అసంతృప్తి రామ్ చరణ్ అభిమానుల్లో కనిపించింది.

ఐతే, రామ్ చరణ్ ఫోటోలను కూడా అక్కడి మేగజైన్స్ లలో కూడా విరివిగా వచ్చింది. ఇక తన కుమారుడి నటనకు రావాల్సిన గుర్తింపు అంతర్జాతీయ పత్రికల్లో ఎక్కువగా రాజమౌళి టీం పుష్ చెయ్యలేదని మెగాస్టార్ చిరంజీవి కొంత బాధపడిన మాట వాస్తవమే అని మెగాస్టార్ సన్నిహిత వర్గాలు తెలుగుసినిమా.కామ్ కి తెలిపాయి.

ఎన్టీఆర్ ని పుష్ చెయ్యడంలో చిరంజీవికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రామ్ చరణ్ ని కూడా అదే స్థాయిలో రాజమౌళి టీం ప్రోమోట్ చెయ్యలేదు అని చిరంజీవిలో అసంతృప్తి ఉంది. అలాగే స్థానిక మీడియా సంస్థలు ఎన్టీఆర్ నటనని ఫలానా వాళ్ళు మెచ్చుకున్నారు, ఫలానా వాళ్ళు ఇదంటూ ఎక్కువ హడావుడి చేసినట్లు చిరంజీవి గమనించారట.

అందుకే, నిన్న జేమ్స్ కామెరూన్ రామ్ చరణ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తావించడంతో తనంత తానుగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన కొడుక్కి కావాల్సిన పుష్ చేశారు. అదే రాజమౌళి టీం మాత్రం యధావిధిగా దాన్ని ఇగ్నోర్ చేస్తుంది అని ఆయన ట్విట్టర్ లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

More

Related Stories