తన సినిమాల రీమేక్ లపై చిరు మాట

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ పీక్ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఒక పది, పదిహేనేళ్ళు చిరంజీవి సినిమాలే మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ట్రెండ్ ని సెట్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది?

“జగదేక వీరుడు అతిలోక సుందరి”కి సీక్వెల్ తీయాలని నిర్మాత అశ్వినీదత్ చాలాకాలంగా ఆలోచిస్తున్నారు. రామ్ చరణ్ డేట్స్ ఇస్తే తీస్తాను.. శ్రీదేవి పాత్రకి జాన్వీ కపూర్ ని తీసుకురావాలనేది అశ్వినీదత్ ఆలోచన. అది ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యేలా లేదు. ఐతే, లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి… తన సినిమాల రీమేక్ ల గురించి స్పందించారు. ఈ కాలానికి తగ్గట్లు తన సినిమాలను మళ్ళీ తీస్తే… ఏ కథకి ఏ హీరో బాగుంటారో తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు.

1. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి
రామ్‌చ‌ర‌ణ్ / మ‌హేశ్‌బాబు.
2. ఠాగూర్‌
ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
3. ఇంద్ర‌
ప్ర‌భాస్‌
4. ఛాలెంజ్‌
అల్లు అర్జున్‌/విజ‌య్ దేవ‌ర‌కొండ‌
5. గ్యాంగ్ లీడ‌ర్
ఎన్టీఆర్ / రామ్‌చ‌ర‌ణ్‌
6. రౌడీ అల్లుడు
ర‌వితేజ / అల్లు అర్జున్‌
7. విజేత
నాగ‌చైత‌న్య‌

More

Related Stories